మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. తీవ్ర గాయాలైన డ్రైవర్ను హైదరాబాద్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అదుపు తప్పిన ఆటో... 10మందికి గాయాలు - accident
ఆటో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టిన సంఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. పది మంది ప్రయాణికులకు గాయాలవగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
చికిత్స పొందుతున్న బాధితులు