తెలంగాణ

telangana

ETV Bharat / state

మెదక్​ చర్చిని సందర్శించిన యునైటెడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బృందం - medak news

మెదక్​ సీఎస్​ఐ చర్చిని యునైటెడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ (యూసీసీ)కు చెందిన ఆరుగురు సభ్యుల బృందం సందర్శించింది. చర్చి కమిటీ సభ్యులు సంప్రదాయం ప్రకారం వారిని ఆహ్వానించారు.

american team visited medak church
మెదక్​ చర్చిని సందర్శించిన యునైటెడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బృందం

By

Published : Feb 9, 2020, 11:10 PM IST

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం నుంచి యునైటెడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ (యూసీసీ)కు చెందిన ఆరుగురు సభ్యుల బృందం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిని సందర్శించింది. ఈ బృందంలో బిషప్ రెవరెండ్ డాక్టర్ బాణీ బెట్స్, బిషప్ బిల్ వర్లే, పాస్టర్లు చంద్ర సోల్, డేవిడ్ ఛార్లెస్ స్మిత్, టోమారో రాయల్ ఉన్నారు. చర్చి కమిటీ సభ్యులు సంప్రదాయం ప్రకారం వారికి స్వాగతం పలికారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

మెదక్ డయాసిస్ బిషప్ డాక్టర్ రెవరెండ్ ఏసీ సాల్మన్ రాజు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినట్లు వారు తెలిపారు. ఏసుక్రీస్తు కొలువై ఉన్న ఈ చర్చ్​ అద్భుతంగా ఉందన్నారు. ఈ చర్చిని సందర్శించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

మెదక్​ చర్చిని సందర్శించిన యునైటెడ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బృందం

ఇవీ చూడండి:ఈనాడు తోడుగా.. లబ్ధిదారులు ఆనందంగా...

ABOUT THE AUTHOR

...view details