మెదక్ జిల్లా కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు వద్ద ఆసరా పెన్షన్ దారులు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా... దూరాన్ని పాటించకుండా గుంపులుగా ఉన్నారు. గమనించిన అదనపు పాలనాధికారి నగేశ్... అదనపు ఎస్పీ నాగరాజుతో కలిసి బ్యాంకు అధికారులతో మాట్లాడి ఖాతాదారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఎక్కడ చూసినా నిర్లక్ష్యం... గుంపులు గుంపులుగా జనం - కరోనా అలెర్ట్
కరోనా నివారణకై లాక్‌డౌన్ విధించినా... కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.
ఎక్కడ చూసినా నిర్లక్ష్యం... గుంపులు గుంపులుగా జనం
జన్‌ధన్ ఖాతాదారులు డబ్బులు తీసుకోవడానికి ఒకేసారి బ్యాంకుకు రావాల్సిన అవసరం లేదని, లాక్‌డౌన్ ముగిశాక కూడా తీసుకోవచ్చని తెలిపారు. బ్యాంకు మిత్రల ద్వారా పెన్షన్ డబ్బులు అందజేయాలని అధికారులకు ఎస్పీ నాగరాజుసూచించారు.