మెదక్ జిల్లాలో 3,200 మంది సూపర్ స్ప్రెడర్లను (వాహకులు) గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ యస్.హరీశ్ తెలిపారు. చౌక ధర దుకాణ డీలర్లు, హెల్పర్లు, ఎల్.పి.జి. డిస్ట్రీబ్యూటర్లు, శ్రామికులు, పెట్రోల్ బంక్ శ్రామికులు, ఎరువులు, రసాయనాలు, విత్తన డీలర్ దుకాణాల్లో పనిచేస్తున్నకార్మికులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది, ఫొటోగ్రాఫర్లకు టీకా వేయుటకు గుర్తించామని ఆయన అన్నారు. వారికి ఈ నెల 28, 29న కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
అందుకోసం జిల్లాలోని ఏడు ప్రాంతాలు మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్, కౌడిపల్లి, పాపన్నపేట, పెద్ద శంకరంపేట్లలో వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామని పాలనాధికారి చెప్పారు. మండలాల పరిధిలోని పీహెచ్సీ కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తీసుకోవాలని వెల్లడించారు. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్నిసంబంధిత మండల ప్రత్యేక అధికారులు పూర్తిగా బాధ్యత తీసుకుని… ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ కోరారు.