తెలంగాణ

telangana

ETV Bharat / state

కొడుకు వివాహేతర సంబంధం.. తండ్రికి 12 లక్షల జరిమానా

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడికి గ్రామ పెద్దలు రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఈ మెుత్తాన్ని మూడు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించారు. అంత పెద్ద మొత్తం కట్టలేనని బాధితుని తండ్రి వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

12 lakhs as compensation for extramarital affair medak district
కొడుకు వివాహేతర సంబంధానికి.. తండ్రికి 12 లక్షల జరిమానా

By

Published : Jan 8, 2021, 10:01 PM IST

వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంగా వెంకటస్వామి అనే యువకుడికి రూ. 12 లక్షలు జరిమానా విధించిన సంఘటన మెదక్ జిల్లా మెదక్ మండలంలోని రాయిన్​పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఇంత మొత్తంలో డబ్బు తాను కట్టలేనని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అతని తండ్రి పోచయ్య తన గోడు వెళ్లబోసుకున్నాడు.

జిల్లాలోని మెదక్​ మండలం పరిధిలోని రాయిన్​పల్లి గ్రామానికి చెందిన నీరుడి వెంకటస్వామి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు మూడు నెలల క్రితం వేరే వ్యక్తితో వివాహం జరిగింది. గత కొద్ది రోజులుగా వీరు ఫోన్లో సంభాషణ కొనసాగిస్తున్నారు.

బుధవారం తన వద్దకు రావాలని వివాహిత వెంకటస్వామికి ఫోన్ చేసింది. అక్కడికి వెళ్లిన అతన్ని గ్రామస్థులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. రాయిన్​పల్లి గ్రామ పెద్దలు వెంకటస్వామికి రూ. 12లక్షలు జరిమానా విధించారు. ఈ మెుత్తాన్ని మూడు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించారు. అంత పెద్ద మొత్తం కట్టలేనని బాధితుని తండ్రి నిరుడి పోచయ్య తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఈ విషయమై మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడంలేదని వాపోయాడు.

ఇదీ చదవండి:'రాష్ట్రంలో​ డ్రైరన్​ సంతృప్తికరంగా సాగుతోంది'

ABOUT THE AUTHOR

...view details