తెలంగాణ

telangana

ETV Bharat / state

YS Sharmila on podu lands: పోడు భూములకు పట్టాలు ఎందుకివ్వరు?: వైఎస్​ షర్మిల - lood effected areas

YS Sharmila on podu lands: పోడు భూముల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసీ మహిళలపై దాడులు చేయడం అమానుషమని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. తెరాస పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచ గూడెంలో ఆదివాసీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

YS Sharmila on podu lands
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

By

Published : Jul 21, 2022, 10:07 PM IST

YS Sharmila on podu lands: పోడు భూముల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసీ మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి చూస్తూ కూర్చోవడం సరికాదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తానన్న కేసీఆర్.. కోయపోచం గూడెం ఆదివాసీలకు పట్టాలు ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించారు.

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోడు భూములకు పట్టాలు ఇస్తే.. సీఎం కేసీఆర్ మాత్రం అటవీ చట్టాలు మార్చాలని మాట మార్చుతున్నారని ఆరోపించారు. పోడు భూముల సమస్యలు పరిష్కారం చేసి పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. పోడు పట్టాలు ఇచ్చే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదన్నారు. ప్రతిసారి ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పడం ఆయనకే చెల్లుతుందని విమర్శించారు. రాజన్న బిడ్డగా మీ పోడు భూముల సమస్య పరిష్కారం అండగా ఉంటానని వైఎస్​ షర్మిల హామీ ఇచ్చారు.

కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ లేదు. వీరికి ఉన్న ఒక్క ఆధారం భూములే కదా. మీరు ఎందుకు స్పందించరు. గిరిజనులు అమాయకులని మీరే అన్నారు కదా. మహిళలని కూడా చూడకుండా దాడులు చేస్తారా? పోడు భూములకు పట్టాలు ఎందుకు ఇవ్వరు? వారికి జీవనోపాధి అయినా పోడు భూములను లాక్కునే అధికారం మీకెవరిచ్చారు? పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. - వైఎస్ షర్మిల. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పలు కాలనీల్లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరద బాధితులను పరామర్శించారు. వరద ధాటికి మునిగి పోయిన ఇళ్లను పరిశీలించారు. వరదల్లో తమ ఇల్లు మొత్తం మునిగి పోయాయని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం 5 కిలోల బియ్యం తప్పా.. రూ.10 వేల ఆర్థిక సహాయం అందలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని రాంనగర్​కాలనీలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సిద్ది జమున కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. వారి కుటుంబానికి ఆసరాగా ఉంటామని భరోసా కల్పించారు.

వరదలు వస్తాయని ముందస్తు అంచనా వేయడంలో అధికారులు, తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని వైఎస్​ షర్మిల ఆరోపించారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణమే రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్​నగర్​లో దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి రూ.5 వేలు తక్షణసాయం అందిస్తామని షర్మిల ప్రకటించారు, వరదల కారణంగా జరిగిన నష్టం పూర్తిగా సీఎం కేసీఅర్ భరించాలన్నారు. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద నీటిని అంచనా వేసి ఉంటే ఈ నష్టం జరిగి ఉండేది కాదన్నారు.

కడెం ప్రాజెక్టు గేట్లు చెడిపోవడంతో 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు మాత్రమే కిందకు వెళ్లిందన్నారు. ప్రాజెక్టులను సూపర్ వైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ఆమె ప్రశ్నించారు. గత మూడేళ్లుగా గేట్లు మార్చాల్సి ఉండగా పట్టించుకోలేదని.. వరద వస్తేనే మీరు మేల్కొంటారా అని నిలదీశారు. ప్రాజెక్ట్ గేట్ల పర్యవేక్షణ కోసం 30 మంది ఉండాలన్నారు. నష్ట పరిహారం మొత్తం ప్రభుత్వ ఖజానా నుంచి కాదు... తెరాస పార్టీ అకౌంట్ నుంచి చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు.

పోడు భూములకు పట్టాలు ఎందుకివ్వరు?: వైఎస్​ షర్మిల

ఇవీ చదవండి:Central team visit: వరద నష్టంపై కేంద్ర బృందం పర్యటన.. మొరపెట్టుకున్న రైతులు

ద్రౌపదీ ముర్ముకు శుభాకాంక్షల వెల్లువ.. ఇంటికి వెళ్లి అభినందించిన ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details