మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో సోమవారం సాయంత్రం ఓ యువకుడి హత్య కలకలం రేపింది. గ్రామంలో రైల్వే గేటు సమీపంలో నివాసముండే వెంకటేష్‌ను వరుసకు సోదరుడయ్యే మహేష్ కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారి పోయాడు. హైదరాబాదులో ఉంటూ ఉన్నత విద్యనభ్యసిస్తున్న వెంకటేష్ నిన్న హైదరాబాద్ వెళ్లాల్సి ఉండగా... కుటుంబ సభ్యులు నిలువరించారు. సోమవారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా... సోదరుడు వచ్చి హత్య చేశాడు. కొడుకు మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.
రామకృష్ణపూర్లో యువకుడి దారుణహత్య - కత్తితో పొడిచి హత్య దారుణ హత్య
మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో విషాదం నెలకొంది. ఓ యువకుడిని వరసకు సోదరుడయ్యే వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు.
రామకృష్ణపూర్లో యువకుడి దారుణహత్య
Last Updated : Oct 15, 2019, 9:55 AM IST