తెలంగాణ

telangana

ETV Bharat / state

సాయంత్రం సీపీఐ... రాత్రి తెరాస... - trs

రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు. మంచిర్యాల జిల్లా అందుగులపేట ఎంపీటీసీ సభ్యుడు సాయంత్రం వరకు సీపీఐలో ఉండి రాత్రికి రాత్రి తెరాసలో చేరి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు.

రాజ్​కుమార్

By

Published : Jun 8, 2019, 8:59 AM IST

మంచిర్యాల జిల్లా అందుగులపేట ఎంపీటీసీగా సీపీఐ అభ్యర్థి రాజ్​కుమార్​ గెలిచారు. కాంగ్రెస్​ అభ్యర్థి జీవన్​పై ఆరు ఓట్ల తేడాతో విజయం సాధించారు. మండల అధ్యక్ష ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతుతో వెస్​ ఎంపీపీ అయ్యాడు. సాయంత్రం సీపీఐ కార్యాలయంలో సంబురాలు చేసుకున్న రాజ్​కుమార్​ రాత్రికే తెరాసలో చేరారు. గంటల వ్యవధిలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.

సాయంత్రం సీపీఐ... రాత్రి తెరాస...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details