మంచిర్యాల జిల్లాలోని గోదావరి తీరం ముల్కల్ల పంప్ హౌజ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వయసు దాదాపు 20 నుంచి 30 ఏళ్లలోపు ఉంటుందని సి.ఐ. కృష్ణ కుమార్ తెలిపారు.
యువకుని తలకు గాయాలై ఉన్నట్లు... రెండు నెలల క్రితమే ప్రమాదం జరిగి ఉండొచ్చని వైద్యులు గుర్తించారు. మృతుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్దరించినట్లు సీఐ వెల్లడించారు. ఎవరైనా తమ కుటుంబ సభ్యులు అదృష్యం అయితే స్థానిక హాజీపూర్ పోలీసులను సంప్రదించాలని కోరారు.