తెలంగాణ

telangana

ETV Bharat / state

చెట్టు కింద తలదాచుకుంటే ప్రాణాలే పోయాయి.. - two-killed-by-rainy-thunder

మట్టి పని కోసం వెళ్లారు. వర్షం రావడంతో తలదాచుకున్నారు. అకస్మాత్తుగా పిడుగు పడి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

By

Published : Aug 31, 2019, 12:04 PM IST

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని కొల్లూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే సైదుల లింగయ్య, సమ్మయ్య వ్యవసాయ భూమిలో పనుల నిమిత్తం నిన్న సాయంత్రం వెళ్లగా వర్షం కురిసింది. ఈ క్రమంలో చెట్టు కిందికి వెళ్లగా అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలంలో వెతికారు. చెట్టు కింద ఇద్దరు విగత జీవులుగా కనిపించారు. లింగయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా సమ్మయ్యకు ఒక కుమారుడు ఉన్నారు. నిరుపేదలయిన వీరికి ప్రభుత్వం సాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ABOUT THE AUTHOR

...view details