మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉషోదయ పాఠశాలలో నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహించారు. నడిపల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన జాబ్ మేళాలో 50 బహుళ జాతీయ సంస్థలను ఆహ్వానించారు. ఈ మేళాలో జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, ఎమ్మెల్యే దివాకర్ రావులతోపాటు సుమారు రెండు వేల మంది నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.
'ప్రభుత్వ ఉద్యోగం అందరికీ సాధ్యం కాదు' - ఎమ్మెల్యే దివాకర్ రావు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నడిపల్లి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి, ఎమ్మెల్యే దివాకర్ రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
'ప్రభుత్వ ఉద్యోగం అందరికీ సాధ్యం కాదు'
ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే తపన ఉంటుంది.. కానీ ఆచరణలో అందరికీ సాధ్యం కాదని కలెక్టర్ అన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో పరిమితులు లేకుండా పని చేయవచ్చని ఆమె నిరుద్యోగులకు సూచించారు.
ఇదీ చూడండి :కరోనా కట్టడికి కేంద్రం కృషి చేస్తోంది: కిషన్ రెడ్డి