తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు సింగరేణిలో వనమహోత్సవం.. భారీగా మొక్కలు నాటేందుకు సిద్ధం

హరితహారం కార్యక్రమానికి సింగరేణి సంస్థ ఏడేళ్లుగా పచ్చని తోరణాలు కడుతోంది. బొగ్గు నిక్షేపాలు ఉన్నాయంటే ఎంత వేగంగా వెలికి తీసే పనులు చేపడుతుందో.. అదే స్థాయిలో ఖాళీ స్థలాలు కనిపించినా...కార్మిక వాడల్లో మొక్కలు నాటుతూ బొగ్గు గనులు, కార్మికక్షేత్రాలను హరితవనాలుగా మారుస్తోంది. వనమహోత్సవంలో భాగంగా గురువారం సింగరేణి వ్యాప్తంగా ఏరియాలో ఒకచోట పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Today is Vanamahotsavam at Singareni
నేడు సింగరేణిలో వనమహోత్సవం.. భారీగా మొక్కలు నాటేందుకు సిద్ధం

By

Published : Jul 23, 2020, 7:40 AM IST

మందమర్రి, శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి ఏరియాల్లో మొక్కలు పెంచేందుకు ఎలాంటి భూమి ఉంటే ఎదుగుదలకు అనువుగా ఉంటుందో పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా వెదురు, రాగి, వెలుగ, చిందుగ, బూరుగ, మర్రి, చేదువేప, నారవేప, ఉసిరి, మామిడి, చింత, నిమ్మ, ఎర్రచందనం, నీరుద్ది నారవేప, టెకోము, గోగన్‌విలియా, గన్నేరు, శీతాఫలం, దానిమ్మ, కరగ, తానీ, సాకార ముంజ, అవిస, జనుము, తుమ్మతో పాటు తదితర మొక్కలు నాటుతున్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇక్కడి నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. అటవీశాఖ, ప్రైవేటు నర్సరీల్లో దొరకని పూలు, పండ్లు, అటవీ జాతి మొక్కలు సింగరేణి నర్సరీలో లభిస్తాయి.

20 రోజుల కిందటే..

వనమహోత్సవం పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని 20 రోజుల కిందటే అన్ని ఏరియాల్లో డైరెక్టర్లు, జనరల్‌ మేనేజర్లు, అధికారులు ప్రారంభించారు. ఆరేళ్లుగా సింగరేణి చేపట్టిన హరితహరం కార్యక్రమంలో 80-90 శాతం మొక్కలను సంరక్షించారు. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించనున్నారు.

ఏరియా ఈ ఏడాది లక్ష్యం

ఇప్పటివరకు

నాటినవి

వనమహోత్సవంలో

నాటే మొక్కలు

వనమహోత్సవంలో

ఎన్ని ఎకరాల్లో

మందమర్రి 3.06 లక్షలు 1.80లక్షలు 2000 నాలుగు శ్రీరాంపూర్​ 4లక్షలు 60 వేలు 1200 ఒకటిన్నర బెల్లంపల్లి 1.5 లక్షలు 30 వేలు 1000 ఒకటిన్నర

దరఖాస్తు చేసుకుంటే మొక్కలు అందజేస్తాం

- చింతల శ్రీనివాస్‌, మందమర్రి జీఎం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా భావితరలకు వృక్ష సంపదను అందచేందుకు సింగరేణి తన వంతు కృషి చేస్తోంది. అవసరమైన వారు దరఖాస్తు చేసుకుంటే మొక్కలు అప్పటికప్పుడే ఇస్తున్నాం.

ఇవీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details