తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉపరితల కార్మికుల పని వేళలు ఎందుకు మార్చరూ' ?

గత వేసవిలో పని వేళల్లో మార్పులు చేసి..ప్రస్తుతం ఎందుకు మార్చట్లేదని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. లాభాల మీద పెట్టిన దృష్టి కార్మికుల సంక్షేమంపై ఎందుకు పెట్టట్లేదని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

ఉపరితల గనుల్లో పని వేళలను మార్చాలి : తెబొగకాసం

By

Published : May 14, 2019, 9:11 PM IST

వేసవి కాలంలో సింగరేణి ఉపరితల గనుల్లో పని వేళలను మార్చాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఉపరితల గనుల వల్ల సింగరేణి సంస్థ అధిక లాభాలను ఆర్జిస్తోందని బొగ్గుగని కార్మిక సంఘం నాయకుడు సురేందర్ రెడ్డి తెలిపారు.
లాభాల మీద పెట్టిన శ్రద్ధ కార్మికుల సంక్షేమంపై ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు. ఎండ వేడిమిలో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాదాలు జరిగితే సింగరేణి యాజమాన్యమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. అనంతరం ఏరియా డీజీయంకు మెమోరాండం సమర్పించారు. ఇప్పటికైనా స్పందించి ఉత్పత్తిపైనే కాకుండా కార్మికుల సంక్షేమంపై కూడా దృష్టి సారించాలని కోరారు.

శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయం ముందు తెబొగకాసం ధర్నా

ABOUT THE AUTHOR

...view details