రైతులు విష దాతలుగా మారొద్దు.. - holikeri
సేంద్రియ వ్యవసాయంపై రైతన్నలకు అవగాహన కల్పించేందుక మంచిర్యాల జిల్లాలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. అన్నదాతలు విషదాతలు మారొద్దని కలెక్టర్ హోళీకేరి సూచించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టీసీఓఏ క్లబ్లో ఆరు మండలాల రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో బెల్లంపల్లి, కాసింపేట, తాండూరు, మందమర్రి, నెన్నెల, భీమిని మండలాల రైతులు పాల్గొన్నారు. రైతులు పురుగు మందుల వాడకం తగ్గించాలని జిల్లా కలెక్టర్ హోళీకేరి అన్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తే ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. రైతులు విష దాతలుగా మారొద్దన్నారు. ఈ ఖరీఫ్ నుంచే సేంద్రియ వ్యవసాయం ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వినోదకుమార్, జిల్లా ఉద్యానశాఖ అధికారి రాజ్ కుమార్, ఏడీఏ సురేఖలు పాల్గొన్నారు.