రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రకు నూతనంగా ఏర్పడిన వంతెనల ద్వారా.. సులభంగా పక్క రాష్ట్రాలకు రాయితీ బియ్యం తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రేషన్ బియ్యానికి అడ్డదారులుగా నూతన వంతెనలు! - ircp news
మంచిర్యాల జిల్లాకు సరిహద్దున ఉన్న మహారాష్ట్రకు నూతనంగా ఏర్పడిన వంతెనల ద్వారా రాయితీ బియ్యాన్ని అక్రమార్కులు తరలిస్తున్నారని ఆందోళన చేపట్టారు. భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గరీబుల బియ్యం గద్దల పాలవుతుందని నినాదాలు చేశారు.
రేషన్ బియ్యానికి అడ్డదారులుగా నూతన వంతెనలు!
చౌక ధరల దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నరకం బియ్యాన్ని అందించాలని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. కరోనా సమయంలో పేద ప్రజలు ఉపాధి కోల్పోయి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అలాంటి ప్రజలకు అందించాల్సిన సరుకులు లారీల్లో పక్కదారి పడుతున్నాయని వాపోయారు.
ఇదీ చూడండి: సాయంత్రం రజినీకాంత్‌ను డిశ్చార్జ్ చేసే అవకాశం!