తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు - monsoons latest news

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఎండ వేడితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వాన కాస్త ఉపశమనం కలిగించింది. అత్యధికంగా మంచిర్యాల జిల్లా కుందారంలో 10.1 సెం. మీ వర్షపాతం నమోదయింది.

rain in telangana districts and people relief from sun hit
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

By

Published : May 30, 2020, 9:36 AM IST

వేసవి తాపంతో అవస్థలు పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షం కురవడం వల్ల వాతావరణం చల్లబడింది. మంచిర్యాల జిల్లా కుందారంలో 10.1 సెం.మీటర్లు, జైపూర్‌లో 9, భీమినిలో 5.3, గద్వాల జిల్లా కాలూరు తిమ్మనదొడ్డిలో 7.7, తొత్తినోనిదొడ్డిలో 6.1, వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండిలో 6.9, నల్లబెల్లిలో 5.4, సంగారెడ్డి జిల్లా లక్ష్మీసాగర్‌లో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో 5 సెం.మీటర్లు, పెద్దపల్లి జిల్లా బొమ్మిరెడ్డిపల్లిలో 4.9,మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, కన్నెపల్లిలో 4.8, సిద్దిపేట జిల్లా కోహెడలో 4.6, కరీంనగర్ జిల్లా ఖాసింకోటలో 4.3 సెం.మీ. వర్షం కురిసింది. వర్షాలతో కొన్ని చోట్ల ధాన్య తడిసిపోయింది. రాబోయే ఐదు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఇదీ చూడండి:'దోషం తొలిగిస్తాడనుకుంటే కోరిక తీర్చమన్నాడు'

ABOUT THE AUTHOR

...view details