తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ విత్తనాలపై పోలీసుల అవగాహన సదస్సు - fake seeds awareness programme

మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్, చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండలాల పరిధిలోని విత్తన వ్యాపారులకు నకిలీ విత్తనాలపై అవగాహన సదస్సు చేపట్టారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే... ఎంతటివారినైనా ఉపేక్షించబోమని, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Police Awareness Seminar on fake seeds
నకిలీ విత్తనాలపై పోలీసుల అవగాహన సదస్సు

By

Published : Jun 7, 2021, 10:47 PM IST

రైతులకు నకిలీ విత్తనాలు ఎరువులు విక్రయిస్తే విత్తన డీలర్లు, యజమానులపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపిస్తామని పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ హెచ్చరించారు. చెన్నూరులోని సంతోషిమాత ఫంక్షన్ హాల్లో జైపూర్ సబ్ డివిజన్​కు సంబంధించిన… చెన్నూరు రూరల్, చెన్నూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మండలాల పరిధిలోని విత్తన వ్యాపారులకు నకిలీ విత్తనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నకిలీ విత్తనాలు అమ్మే వ్యాపారులను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని తెలిపారు.

అలాంటి వారిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా టాస్క్​ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. విత్తనాల విక్రయాలపై ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయి. ఆంధ్రప్రదేశ్ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి మంచిర్యాల జిల్లాలో నకిలీ విత్తనాలు అధికంగా వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణాల యజమానులు రైతులకు నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందు, అధిక ధరకు అమ్మిన, ఎమ్మార్పీ ధర కంటే అధికంగా అమ్మినా చర్యలు తప్పవన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం సూచనలు, సలహాలు, నిబంధనలకు అనుగుణంగా డీలర్లు విత్తనాలు విక్రయించాలని స్పష్టం చేశారు. హెచ్​టీ కాటన్ విక్రయాలకు అనుమతి లేదన్నారు. కొనుగోలు చేసిన ఎరువులు, విత్తనాలు, పురుగు మందులకు సంబంధించి రైతులు డీలర్ల నుంచి రశీదులు తీసుకోవాలని సూచించారు. బిల్లు లేకుండా ఎవరైనా విత్తనాలు అమ్మితే వెంటనే వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూరు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, రూరల్ సీఐ నాగరాజు, ఎస్సైలు, వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:ఆహార భద్రత స్థాయి నుంచి ఆహార భరోసా స్థితికి చేరుకున్నాం: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details