మంచిర్యాల జిల్లా మందమర్రిలో జంగంపల్లి ఓదెలు-పద్మ దంపతుల కూతురైన అనూష వివాహాన్నిపలువురు దాతలు ఘనంగా జరిపించారు. పెళ్లి పెద్దలుగా మందమర్రి సీఐ ఎడ్ల మహేశ్, ఎస్సై భూమేశ్ రామకృష్ణాపూర్ ఎస్సై రవి ప్రసాద్, కాసిపేట ఎస్సై రాములు, పురపాలక కమిషనర్ రాజు, ఇంజినీర్‌తో పాటు అనేక మంది స్వచ్ఛంద సంస్థ సభ్యులు, నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
చేయీ చేయీ కలిపారు... పేదింటి అమ్మాయి పెళ్లి చేశారు - పోలీసులు చేసిన వివాహం
ఇంటి పెద్ద అనారోగ్యం కారణంగా ఆ కుటుంబం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. అందరూ కూలి చేస్తేనే ఆ కుటుంబం గడిచే పరిస్థితి. ఇదే సమయంలో పెళ్లికి ఎదిగిన కూతుర్ని వివాహం చేసుకునేందుకు దగ్గరి బంధువు ముందుకొచ్చాడు. ఆ పెళ్లి చేసే స్థోమత లేని కుటుంబానికి మేమున్నామంటూ అండగా నిలిచి వివాహం జరిపించారు.
చేయీ చేయీ కలిపారు... పేదింటి అమ్మాయి పెళ్లి చేశారు
పంచముఖి హనుమాన్ ఆలయం యూత్ సభ్యులు రూ.2 లక్షలు, మేము సైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులు రూ.35 వేలు విరాళంగా ఇవ్వగా... సీఐ మహేశ్, ఎస్సై భూమేశ్తో పాటు పలువురు మానవతావాదులు నాయకులు ముందుకు వచ్చి చేతనైనంత సాయం చేశారు.