మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణిని స్థానికులు సకాలంలో వాగు దాటించి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడారు. నక్కలపల్లి గ్రామానికి చెందిన సుభద్ర.. నిండు గర్భిణీ కావడంతో ఉదయం పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో చెన్నూరు ఆస్పత్రికి తీసుకు వస్తున్నారు. మధ్యలో లోతోర్రె పొంగడంతో అక్కడే ఆగిపోయారు. 108 అంబులెన్స్‌కు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. వాహనం వాగు దాటి రాలేని పరిస్థితి నెలకొంది.
HELP TO PREGNANT: నిండు గర్భిణీని వాగు దాటించిన స్థానికులు.. తల్లీబిడ్డ క్షేమం - తెలంగాణ వార్తలు
పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి సాయం చేసి తల్లీబిడ్డ ప్రాణాలు కాపాడారు స్థానికులు. మంచిర్యాల జిల్లా నక్కలపల్లి గ్రామానికి చెందిన సుభద్రకు పురిటి నొప్పులు రాగా.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో వాగు పొంగిపొర్లింది. అంబులెన్సు వాగు దాటలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో స్థానికులు స్పందించి ఆమెను అతికష్టం మీద వాగు దాటించి మానవత్వం చాటుకున్నారు.
నిండు గర్భిణీని స్ట్రెచర్‌పై వాగు దాటించిన స్థానికులు, తల్లీబిడ్డ క్షేమం
కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది, స్థానికులు అతి కష్టం మీద సుభద్రను స్ట్రెచర్‌పై అంబులెన్స్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు మరింత ఎక్కువ అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది మార్గంమధ్యలోనే పురుడు పోశారు. సుభద్ర పండంటి శిశువుకి జన్మనివ్వగా.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు.
ఇదీ చదవండి:DIKSHANT PARADE: జాతీయ పోలీస్ అకాడమీలో దీక్షాంత్ సమారోహ్