పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 24వ వార్డుకు వచ్చిన ఎమ్మెల్యేకు, ఆ ప్రాంత కాంగ్రెస్ కౌన్సిలర్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. వార్డుకు వచ్చిన ఎమ్మెల్యేకు సమస్యలు చూపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ తీసుకెళ్లగా.. తెరాస నేతలు ఎమ్మెల్యేను మరోవైపు తీసుకెళ్లారు. ఈ సందర్భంలో వాగ్వాదం చోటు చేసుకుంది.
సమస్యలు ఇక్కడ ఉంటే మీరు పక్కకు ఎందుకు తీసుకువెళ్తున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్ ప్రశ్నించాడు. అధికార పార్టీ నాయకులతో దురుసుగా ప్రవర్తిస్తే మీ వార్డు ఎలా అభివృద్ధి చెందుతుంది శాసనసభ్యుడు దివాకర్ రావు వారించారు.