మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాధాకృష్ణ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన పుస్తకాలను రైల్వే స్టేషన్ రోడ్డులోని అజయ్ బుక్స్టాల్లో అమ్మకాలకు యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. తమ పిల్లలకు సంబంధించిన పుస్తకాలను కొనడానికి వెళ్లిన తల్లిదండ్రులు... ధరలను చూసి ఆగ్రహానికి లోనయ్యారు. ఎల్కేజీ విద్యార్థుల పుస్తుకాల ధర 4 వేల రూపాయలుంటే ఎలా కొనేదంటూ వాదనకు దిగారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు ఇక్కడ అమ్ముతున్నారనే సమాచారం విద్యాధికారి రషీద్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు తనిఖీలు నిర్వహించి అమ్మకాలను నిలిపివేశారు.
'ఎల్కేజీ పుస్తకాల ధర నాలుగు వేలా?' - books
మంచిర్యాల జిల్లా కేంద్రంలో పుస్తకాల అమ్మకం విషయంలో మోసం జరుగుతుందంటూ... విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బుక్ స్టాల్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.
పుస్తకాల అమ్మకం విషయంలో మోసం