తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇవి పిట్టగూళ్లు కాదు.. మామిడి కాయలు - mangoes

వేసవి వచ్చిందంటే చాలు అకాల వర్షం, ఈదురుగాలులు మొదలవుతాయి. ఏడాది పాటు కళ్లలో పెట్టుకుని  కాపాడుకున్న మామిడి కాయలు నేలరాలిపోతాయి. రాలిన కాయలు దెబ్బ తగిలి విక్రయానికి పనికిరాకుండా పోతాయి.  కానీ ఆ ఊళ్లో మామిడి కాయలు నేల రాలినా.. దెబ్బతినవు. ఎలా అనుకుంటున్నారా!

ఇవి పిట్టగూళ్లు కాదు.. మామిడి కాయలు

By

Published : Apr 30, 2019, 3:48 PM IST

ఆరుగాలం శ్రమించి పండించిన పంట ప్రకృతి కోపానికి బలైపోతోంది. కోతకొచ్చిన పంట నేలపాలైతే.. రైతు ఆవేదన అంతా ఇంతా కాదు. ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టింది ఉద్యాన శాఖ. ఈదురుగాలులు, వడగళ్ల నుంచి మామిడి కాయలను కాపాడేందుకు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓ ప్రయోగం చేపట్టింది.

ఇవి పిట్టగూళ్లు కాదు.. మామిడి కాయలు

దెబ్బ తగలకుండా

బెల్లంపల్లి మండలం కన్నాల శివారులో ఐటీడీఏ పరిధిలోని 30 ఎకరాల్లో మామిడి తోట విస్తరించి ఉంది. ఈదురుగాలులకు మామిడి కాయలు కిందపడినా దెబ్బ తినకుండా ఉండేందుకు కాయలకు కాగితం సంచులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 3 వేల కాయలకు ఈ సంచులను ఏర్పాటు చేశారు. మామిడి కాయకు కాగితం సంచి కట్టడం వల్ల అవి నేలరాలినా నాణ్యత దెబ్బతినకుండా ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు తెలిపారు.

రూపాయికో సంచి

వడగళ్ల సమయంలో రైతులకు నష్టం జరిగే అవకాశాలు తక్కువని తెలిపారు. ఒక సంచి విలువ రూపాయి ఉంటుందని ఈ ప్రయోగం విజయవంతమైతే రైతులకు వచ్చే ఏడాది ఉద్యాన శాఖ రాయితీపై ఈ సంచులను ఇచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి : 'తులిప్​' అందాలు చూడతరమా?

ABOUT THE AUTHOR

...view details