మున్సిపల్ ఒప్పంద కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈపీఎఫ్ డబ్బులు 11ఏళ్లుగా రికవరీ చేస్తూ ఖాతాల్లో మాత్రం జమ చేయడం లేదన్నారు. ఈఎస్ఐ సమస్య కూడా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య కార్డులు అందజేయాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ త్రయంభకేశ్వర్ రావుకు వినతి పత్రం సమర్పించారు.
బెల్లంపల్లిలో ఒప్పంద కార్మికుల ధర్నా - esi
తమ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఒప్పంద కార్మికులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఒప్పంద కార్మికుల ధర్నా