మంచిర్యాల జిల్లా మందమర్రిలో లక్ష్మి అనే వృద్ధురాలు అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలు ఉదయం సమయంలో మంచం మీద శవమై కనిపించటం అనుమానాలు రేకెత్తిస్తోంది. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. బంధువులు వచ్చి పరిశీలించగా... అప్పటికే వృద్ధురాలి మెడలో రెండు తులాల బంగారు గొలుసు కనిపించకపోవటం వల్ల మృతిపై సందేహాలు ఏర్పడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఇంట్లో ఉన్న ఐదు తులాల బంగారం, వంద తులాల వెండి, రూ. 28 వేల నగదును దొంగలు ముట్టుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది.
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి - OLD WOMEN
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఓ వృద్ధురాలు చనిపోవటం కలకలం రేపుతోంది. మెడలో ఉన్న రెండు తులాల బంగారం కన్పించకపోవటం అనుమానానికి దారితీసింది. కానీ ఇంట్లో ఉన్న 5 తులాల బంగారం... 100 తులాల వెండితో పాటు నగదును పట్టించుకోకపోవటం ఆశ్చర్యంగా మారింది.
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి