మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం అన్నారం బ్యారేజ్ వద్ద స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆధ్వర్యంలో కాళేశ్వరం జలజాతర వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెరాస నాయకులు పాల్గొన్నారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించారని మంత్రిలు కొనియాడారు.
'కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం' - mla
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుందరశాల సమీపంలోని అన్నారం బ్యారేజ్ వద్ద కాళేశ్వరం జలజాతర వనభోజనాలల్లో పాల్గొన్నారు.
భోజనం చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు