No Confidence Motion in Bellampalli Municipality :మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఓవైపు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. మరోవైపు అవిశ్వాసానికి ( No Confidence Motion)సమయం సమీపిస్తుండడంతో ఇరు పార్టీల నేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఈరోజే గులాబీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రత్యేక బస్సులో శిబిరానికి తరలి వెళ్లారు. దాదాపు 20 మంది క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. భారత్ రాష్ట్ర సమితి శిబిరం నుంచి ఛైర్మన్ అభ్యర్థిగా గోసిక రమేశ్, వైస్ ఛైర్మన్ అభ్యర్థిగా అప్సర్ బరిలో ఉండేందుకు నిర్ణయించారు.
కాంగ్రెస్ వైపు 12 మంది కౌన్సిలర్లు :మరోవైపు ఎన్నికలకు ముందే ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల మున్సిపల్ ఛైర్‌పర్సన్ జక్కుల శ్వేతతో పాటు మరో ముగ్గురు గులాబీ పార్టీ కౌన్సిలర్లు, ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో హస్తం పార్టీలో చేరారు. మున్సిపాలిటీలో అధికార పార్టీ 11 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ప్రస్తుత ఛైర్‌పర్సన్ చేరికతో కలిపి ఈ సంఖ్య 12కు చేరుకుంది.
మళ్లీ తెరపైకి పుర అవిశ్వాసాలు - గవర్నర్ ఆమోదం పొందని అవిశ్వాసాల సవరణ బిల్లు
No Confidence Motion in Bellampalle Municipality :ఇప్పటికే జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోశ్ ఈ నెల 12న అవిశ్వాసానికి సంబంధించి సమావేశం నిర్వహించడానికి, కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మద్దతు కోసం, ప్రస్తుత ఛైర్మన్ జక్కుల శ్వేత తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు హస్తం పార్టీ మరో వర్గం తమలోని ఇద్దరు కౌన్సిలర్లను ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్‌లుగా చేయడానికి పావులు కదుపుతున్నారు. ఫలితంగా బెల్లంపల్లిలో క్యాంపు రాజకీయాలు వేడిని పుట్టిస్తున్నాయి.