ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఏడాదికి రెండు జతల దుస్తులను ఉచితంగా అందజేస్తున్నారు. గతంలో బాలురకు నీలి (బ్లూ) రంగు చొక్కా, ముదురు(థిక్) రంగు ప్యాంటు లేదా నిక్కరు, బాలికలకు అదేరంగు కల పంజాబీ డ్రెస్‌ను అందజేసేవారు.
నీలి రంగు నిక్కర్లు.. నారింజ గళ్ల చొక్కాలు - విద్యాశాఖ వార్తలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చే ఏకరూప దుస్తుల రంగు మారింది. ఈసారి బాలురకు నీలి ఆకాశం రంగులో నిక్కరు లేదా ప్యాంటు, నారింజ రంగు గళ్లతో కూడిన చొక్కా, బాలికలకు అవే రంగులతో కూడిన పంజాబీ డ్రెస్‌ను అందించనున్నారు.
నీలి రంగు నిక్కర్లు.. నారింజ గళ్ల చొక్కాలు
ఈ సారి రంగు మారింది. బాలురకు నీలి ఆకాశం రంగులో నిక్కరు లేదా ప్యాంటు, నారింజ రంగు గళ్లతో కూడిన చొక్కా, బాలికలకు అవే రంగులతో కూడిన పంజాబీ డ్రెస్‌ను అందించనున్నారు. ఈ మేరకు అవసరమైన వస్త్రం ఎమ్మార్సీల నుంచి పాఠశాలలకు చేరింది. వీటిని త్వరలోనే కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: భాజపాలోకి షహీన్‌బాగ్ నిరసనకారుడు అలీ