మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్‌లో దారుణం జరిగింది. కమలాకర్ అనే ప్రేమోన్మాది మద్యం మత్తులో వివాహిత గొంతు కోశాడు. ఆపై తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలైన బాధితురాలిని, నిందితుడిని మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గతంలో బాధితురాలు, కమలాకర్ ప్రేమించుకున్నారు. ఆమె తల్లిదండ్రులు మరో వ్యక్తితో వివాహం చేశారు. రెండు రోజుల కింద తన సోదరి ఇంటి నుంచి తనను బలవంతంగా తీసుకెళ్లాడని బాధితురాలు తెలిపింది. రామకృష్ణపూర్లోని రామాలయం సమీపంలో మద్యం బాటిల్తో తన గొంతు కోశాడని విలపించింది. అదే సీసాతో కమలాకర్ గొంతు కోసుకున్నట్లు బాధితురాలు తెలిపింది. నిందితుడి స్వస్థలం మందమర్రి మండలం పులిమడుగు.
మద్యంమత్తులో వివాహిత గొంతు కోసిన ఉన్మాది.. ఆ తర్వాత!? - murde attempt
ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా... ఎన్ని శిక్షలు వేసినా.. ఉన్మాదం ఆగడం లేదు. ఓ ప్రేమోన్మాది మద్యం మత్తులో వివాహిత గొంతుకోశాడు. ఆపై తానూ ఆత్మహత్యాయత్నం చేశాడు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.
మద్యంమత్తులో యువతి గొంతు కోసిన ఉన్మాది