మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా పార్టీ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రచారం నిర్వహించారు.
అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి దిగిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీలు - municipal election campaign in manchiryal district
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గర పడడం వల్ల ప్రధాన పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మంచిర్యాలలో తెరాస, కాంగ్రెస్, భాజపా పార్టీల అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. తమ పార్టీలకు చెందిన అభ్యర్థులకు మద్దతుగా నేతలు ప్రచారంలో దిగారు.
అభ్యర్థులకు మద్దతుగా రంగంలోకి దిగిన ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీలు
భాజపా తరఫున మాజీ ఎంపీ వివేక్ రంగంలోకి దిగారు. కాంగ్రెస్ తరఫున మాజీ మంత్రి జి.వినోద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఏ గల్లీ చూసిన నాయకులే కనిపించారు.
ఇదీ చూడండి: 'చెప్పేందుకు అబద్ధాలు లేక మొహం చాటేశారు'