తెలంగాణ

telangana

ETV Bharat / state

సుందిళ్ల ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే దివాకర్​ రావు - మంచిర్యాల వార్తలు

మత్స్యకారులకు నాలుగో విడత చేప పిల్లల పంపిణీలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దివాకర్​ రావు పాల్గొన్నారు. గోదావరినది సుందిళ్ల ప్రాజెక్టు నిల్వ నీటిలో ఆరు లక్షల చేప పిల్లలను వదిలారు.

సుందిళ్ల ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే దివాకర్​ రావు
సుందిళ్ల ప్రాజెక్టులో చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే దివాకర్​ రావు

By

Published : Dec 17, 2020, 5:09 PM IST

మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ఎమ్మెల్యే దివాకర్​ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన మత్య్సకారులకు నాలుగో విడత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుందిళ్ల ప్రాజెక్టులో ఆరులక్షల చేప పిల్లలను వదిలారు. ఎల్లంపల్లి జలాశయంలో చేపల పెంపకం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

గంగపుత్రుల కోసం ప్రభుత్వం వాహనాలను అందించిందని ఎమ్మెల్యే గుర్తుచేశారు. సుందిళ్ల ప్రాజెక్టు నిల్వ నీటిలో 11.40 లక్షల చేప పిల్లలను పెంచనున్నట్లు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం తర్వాత మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపడం కోసం సర్కారు ప్రయత్నిస్తోందని తెలిపారు.

ఇదీ చూడండి:పెళ్లైన 15 రోజులకే ఆత్మహత్యాయత్నం... వరుడు మృతి

ABOUT THE AUTHOR

...view details