మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ నస్పూర్, లక్సెట్టిపేట, దండేపల్లి మండల్లోని సుమారు వెయ్యి మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దివాకర్ రావు చెక్కులు అందజేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని పలు మండలాల్లో లబ్ధిదారులకు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ప్రభుత్వ పథకాలు తీసుకోవడంలో దళారులను ఆశ్రయించవద్దని... చెక్కులు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. కరోనా సమయంలోను సాయం అందిస్తోన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.