దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇంటింటికీ ఫీవర్ సర్వే చేపట్టారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా నియంత్రణ, ధాన్యం కొనుగోళ్లపై మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో కొవిడ్ కేసుల పరిశీలన, ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందుల పరిష్కారం కోసమే సమావేశమైనట్లు మంత్రి తెలిపారు. లాక్డౌన్ పెట్టిన తర్వాత కేసులు తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు. ఫీవర్ సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు.
లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గాయి: ఇంద్రకరణ్ - minister indrakaran reddy review on corona
కరోనా నియంత్రణ, ధాన్యం కొనుగోళ్లపై మంచిర్యాల జిల్లా అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భౌతిక దూరం పాటిస్తూ కరోనాను కట్టడి చేయాలని ప్రజలకు సూచించారు. కొవిడ్ లక్షణాలుంటే కచ్చితంగా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు, కరోనా నియంత్రణపై మంత్రి ఇంద్రకరణ్ సమావేశం
జిల్లాలో 230 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు అంచనా వేశామని.. ఇప్పటికే 40 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల రైస్ మిల్లర్లతో విప్ బాల్క సుమన్ సమావేశమయ్యారని చెప్పారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు.
ఇదీ చదవండి:కరోనా బాధితులకు ఉచితంగా ఆహారం అందిస్తోన్న స్వచ్ఛంద సంస్థ