సింగరేణి కార్మికులను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి వారందరికి కొవిడ్ టీకాలు అందేలా కృషి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామీ ఇచ్చారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఆస్పత్రిని.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కలెక్టర్ భారతి హోళీ కేరితో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం కొవిడ్ రెండోదశ పరిస్థితులపై.. వైద్యులతో సమీక్ష నిర్వహించారు.
ఆస్పత్రిలో కేవలం సింగరేణి కార్మిక కుటుంబాలకే కాక.. స్థానికులందరికీ వైద్యం అందేలా కృషి చేస్తామన్నారు మంత్రి. కార్మికులకు టీకాలు అందించే విషయంలో.. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శితో ఇప్పటికే చర్చించినట్లు బాల్క సుమన్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో కలెక్టర్ నుంచి ఆదేశాలు వస్తాయని వివరించారు.