తెలంగాణ

telangana

ETV Bharat / state

'100 రోజుల్లో... ఇంటింటికి భగీరథ నీరు' - అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర కరణ్​రెడ్డి

మిషన్​ భగీరథ నీళ్లను ప్రతి ఇంటికి అందించడమే లక్ష్యంగా పెట్టుకుని అధికారులు వంద రోజుల్లోగా పనులన్నీ పూర్తి చేయాలని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి అధికారులను ఆదేశించారు.

మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి సమీక్ష

By

Published : Oct 22, 2019, 8:25 PM IST

మిషన్​ భగీరథ నీటిని త్వరగా..ఇంటింటికి అందించేందు అధికారులంతా కృషి చేయాలని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఆదేశించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్​ మండలంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. జిల్లాలోని పలు శాఖలకు చెందిన అధికారులు.. వారి వద్దకు వచ్చిన వినతి పత్రాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల వినతిని పరిగణలోకి తీసుకుని తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్​ బాల్క సుమన్​ పాల్గొన్నారు.

మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి సమీక్ష

ABOUT THE AUTHOR

...view details