హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకపుల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పోలీసు కంట్రోల్ రూమ్ ముందు రోడ్డుపై నీరు రావటం వల్ల వాహన దారులు, బాట సారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్క సారిగా వర్షం కురవడంతో ప్రజలు తడిసి ముద్దయ్యారు.
ఇవీ చూడండి : అద్దె బస్సుల కోసం పదివేల టెండర్లు