తెలంగాణ

telangana

ETV Bharat / state

నాలుగు వేల చేతులతో వేసిన చెత్త...నాలుగు చేతులతో ఎలా సాధ్యం - కలెక్టర్ పర్యటన

30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్లికేరి బెల్లంపల్లిలో పర్యటించారు. గ్రామంలోని పలు వార్డుల్లో తిరిగిన పాలనాధికారి గ్రామస్తులకు పలు సూచనలు చేశారు.

బెల్లంపల్లిలో కలెక్టర్​ భారతి హోళ్లికేరి

By

Published : Sep 18, 2019, 5:18 PM IST

నాలుగు వేల చేతులతో వేసిన చెత్త ... ఇద్దరితో తీయడం ఎలా సాధ్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హళ్లికేరి అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాతబెల్లంపల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గ్రామమంతా తిరిగిన ఆమె ఇళ్లముందున్న చెత్తను వారితోనే తీసివేయించారు. చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్డుపైన వేస్తే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. పశువులు రోడ్డుపైన తిరగకుండా ఇళ్లలోనే కట్టేసుకోవాలని సూచించారు.
గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. గ్రామంలోని రోడ్లను శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, సర్పంచ్​ రాజలింగు, ఎంపీటీసీ సభ్యుడు కారుకూరి రాంచందర్ పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో కలెక్టర్​ భారతి హోళ్లికేరి

ABOUT THE AUTHOR

...view details