తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమించాడు... పెళ్లంటే పారిపోయాడు - cheating his girl friend

ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరగా ముఖం చాటేశాడో యువకుడు. దిక్కుతోచని స్థితిలో ప్రియుని ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది ఆ ప్రేమికురాలు.

మోసం చేసిన ప్రేమికుడు

By

Published : Feb 12, 2019, 7:52 PM IST

Updated : Feb 12, 2019, 11:43 PM IST

మోసం చేసిన ప్రేమికుడు
పురుగుల మందు డబ్బా చేత పట్టుకుని దీనంగా కూర్చున్న ఈ యువతి పేరు స్వప్న. మంచిర్యాల జిల్లా పుల్లగాం గ్రామానికి చెందిన ఈమె, సమ్మయ్య అనే యువకుడు నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని త్వరగా వివాహం చేసుకోవాలని స్వప్న సమ్మయ్యపై ఒత్తిడి తెచ్చింది. ఈ సమయంలో యువకుడు కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయాడు. మోసపోయినట్లు గ్రహించిన ప్రియురాలు పురుగుల డబ్బా పట్టుకుని ప్రియుని ఇంటి ముందు మౌనపోరాటం చేస్తుంది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు బాధితురాలికి అండగా నిలిచారు.
స్వప్నకు న్యాయం జరగాలని గ్రామస్థులు ఆకాంక్షిస్తున్నారు.
Last Updated : Feb 12, 2019, 11:43 PM IST

ABOUT THE AUTHOR

...view details