మంచిర్యాల జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటున్నారు. మంచిర్యాల శాసనసభ్యుడు దివాకర్‌రావు కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
మంచిర్యాలలో ఓటు హక్కు వినియోగించుకున్న దివాకర్‌రావు - పోలింగ్ ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మంచిర్యాలలో ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు కూడా ప్రజలతో కలిసి క్యూలో వెళ్లి ఓటేశారు.
పోలింగ్ ప్రశాంతం