పశువులపై చిరుత దాడి... భయాందోళనలో గ్రామస్థులు - manchiryal news
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట అటవీ ప్రాంతంలో చిరుత దాడి కలకలం రేపుతోంది. మేతకు వెళ్లిన పశువులపై చిరుత దాడి చేయగా... గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
leopard attack on ox in manciryala
మేతకు వెళ్లిన పశువులపై చిరుతపులి దాడి చేసిన ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పశువులపై చిరుత పులి దాడి చేయడం నన్నూరు పునరావాస కేంద్రానికి చెందిన శ్రీరాములు రాజయ్య ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. తమ గ్రామంలో పులి దాడి చేయడం ఇది రెండోసారి అని గ్రామస్థులు చెబుతున్నారు.