మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామశివారులో ఉన్న ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది. రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. కబ్జా చేయడంతోపాటు ప్లాట్లుగా విక్రయించి పేదలకు అంటగడుతున్నారు. రాష్ట్ర రహదారిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బెల్లంపల్లిలో పేట్రేగిపోతున్న భూమాఫియా - land mafia
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భూ అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో కబ్జాలకు పాల్పడుతున్నారు. రెవెన్యూ అధికారులు కబ్జాలను కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కావడం లేదు.
![బెల్లంపల్లిలో పేట్రేగిపోతున్న భూమాఫియా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5085404-345-5085404-1573909720825.jpg)
గతంలో కబ్జాలపై ఉక్కుపాదం మోపిన తహసీల్దార్ శ్రీనివాస్ ఇటీవల సెలవులో ఉండడం వల్ల కబ్జా రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కబ్జాల వ్యవహారం తెరపైకి రావడంతో తహసీల్దార్ శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. కోర్టుకు కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని కూడా ఆక్రమించే ప్రయత్నం చేశారని తహసీల్దార్ స్వయంగా చెప్పడం విస్తుగొల్పుతోంది. గతంలో ప్రభుత్వ భూముల విషయంలో కన్నాల గ్రామ సర్పంచ్ హత్యకు కూడా గురయ్యారు. అధికారులు స్పందించి ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి: మక్క చేనులో ముమైత్, తమన్నా