మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిధిలోని 29 గ్రామ పంచాయతీలలోని వలస కూలీలను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు, వైద్య సిబ్బంది 15 బృందాలుగా ఏర్పడి ప్రత్యేక సర్వే చేశారు.
వలస కూలీలకు వైద్య పరీక్షలు
మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిధిలోని 29 గ్రామ పంచాయతీల్లోని వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ ఆధ్వర్యంలో 460 మంది వలస కూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వలస కూలీలకు వైద్య పరీక్షలు
ఇప్పటి వరకు మండలానికి వచ్చిన 460 మంది వలస కూలీలను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిని గృహ నిర్భంధంలోనే ఉండాలని, బయటకు రాకూడదని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు.
ఇవీ చూడండి: కన్నీటి గాథపై స్పందించిన మానవత్వం