మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో జయంతి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. అర్చకులుస్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహిస్తున్నారు. దేవతామూర్తుల విగ్రహాలను పువ్వులతో అందంగా అలంకరించారు. స్వామి వారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు. రామ నామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.
మంచిర్యాలలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
రాష్ట్రంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. మంచిర్యాలలో ఉదయం నుంచి ఆంజనేయ ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అందమైన పువ్వుల అలంకరణలతో ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి.
హనుమాన్ జయంతి