మంచిర్యాల పట్టణంలో తాగునీటికి బదులు మురికి నీటిని అందిస్తున్నారని మున్సిపాలిటీ కార్యాలయం ముందు భాజపా కార్యకర్తలు ఆందోళన చేశారు. ప్రజలకు తాగునీరు అందించడంలో పురపాలక సిబ్బంది, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని భాజపా నాయకుడు రఘునాథ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెంతనే గోదావరి ఉన్నా... తాగు నీరేదీ ? - DRINKING WATER
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు విఫలమయ్యారని భాజపా నాయకుడు రఘునాథ్ రావు విమర్శించారు. పట్టణ ప్రజలకు శుద్ధ జలం అందించాలని పురపాలకులను కోరారు.
ఎమ్మెల్యే కూడా ఈ నీరే తాగుతున్నారా ? : రఘునాథ్ రావు
తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన మంచిర్యాల మున్సిపాలిటీకి అనేక సమస్యలు ఉన్నాయని, డంపింగ్ యార్డు లేక చెత్త సేకరణ చేయట్లేదని అన్నారు. పుర నిధులను నాయకులు, అధికారులు వృథా చేయకుండా ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి ఉపయోగించాలని సూచించారు.
ఇవీ చూడండి : కూలికి పోకుంటేనే బిందె నిండుతది