తెలంగాణ

telangana

ETV Bharat / state

బెల్లంపల్లిలో ప్రశాంతంగా గణపయ్య నిమజ్జనం - manchiryala

డప్పు చప్పుళ్లు, తీన్​ మార్​ డ్యాన్స్​లతో వినాయకుడికి వీడ్కోలు పలికారు బెల్లంపల్లి వాసులు. నవరాత్రులు పూజలు అందుకున్న విఘ్నేశ్వరుడిని గంగమ్మ చెంతకు చేర్చారు.

ణపయ్య నిమజ్జనం

By

Published : Sep 12, 2019, 10:10 AM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వినాయక శోభాయాత్ర ఘనంగా జరిగింది. నవరాత్రులు పూజలు అందుకున్న లంబోదరుడిని చివరి రోజు భక్తులు భారీ సంఖ్యలో దర్శించుకున్నారు. గణపయ్యను విద్యుత్​ దీపాల వెలుగులో ఊరేగించారు. డప్పు చప్పుళ్లు, తీన్​ మార్​ డ్యాన్సులతో విఘ్నేశ్వరుడికి వీడ్కోలు పలికారు. గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏసీపీ బాలు జాదవ్ ఆధ్వర్యంలో పోచమ్మ చెరువు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

బెల్లంపల్లిలో ప్రశాంతంగా గణపయ్య నిమజ్జనం

ABOUT THE AUTHOR

...view details