మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మంచిర్యాల నుంచి మందమర్రి వైపు వస్తున్న ఆటోను జీప్ ఢీకొట్టడం వల్ల ఆటో బోల్తా పడి అందులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మంచిర్యాల ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయాలు - jeep
ఆటో- జీప్ ఢీకొని ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన మంచిర్యాల జిల్లా బొక్కలగుట్టలో చోటుచేసుకుంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఐదుగురికి తీవ్రగాయాలు