మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఈవీఎంల మొరాయింపు అధికారులకు తలనొప్పిగా మారింది. ఉదయం 7 గంటల నుంచి యంత్రాలు సరిగా పనిచేయకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి. బెల్లంపల్లి బస్తీ పోలింగ్ కేంద్రం 58, బాబు క్యాంపు బస్తీలోని 82వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ యంత్రాలు రెండు సార్లు పనిచేయలేదు. అలాగే కాసిపేట మండలం కోమటిచేను గ్రామం 19వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల మొరాయింపుతో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. కేంద్రాల్లో సరైన సౌకర్యాలు కల్పించలేదంటూ ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బెల్లంపల్లిలో ఈవీఎంల మొరాయింపు
రాష్ట్రంలో అక్కడక్కడ ఈవీఎంలు పనిచేయక ఇబ్బందులు తప్పలేదు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓటింగ్ యంత్రాల మొరాయింపుతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. పోలింగ్ ఆలస్యంపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈవీఎంల మొరాయింపు