మంచిర్యాల జిల్లా జన్నారంలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ తన భర్తతో విభేదాల కారణంగా దూరంగా ఉంటోంది. జన్నారంలో పనిచేసే యువకుడిని ఆమె ప్రేమిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై తహిసినొద్దీన్, కానిస్టేబుల్ మాణిక్ రావు మహిళా కానిస్టేబుల్ను బెదిరించి లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. ఎస్సై, మరో కానిస్టేబుల్ పైశాచికత్వాన్ని భరించలేక జిల్లా ఎస్పీకి తన గోడు వెళ్లబోసుకుంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్సై తహిసినోద్దీన్, కానిస్టేబుల్ మాణిక్రావుతోపాటు మహిళా కనిస్టేబుల్పై వేటు వేశారు.
మహిళా కానిస్టేబుల్ను వదలని ఎస్సై - constable
క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ శాఖలో కొందరు సిబ్బంది గాడి తప్పుతున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్ వ్యక్తిగత వ్యవహారంలో ఎస్సై, కానిస్టేబుల్ తలదూర్చి శారీరకంగా లొంగదీసుకోవాలనుకున్నారు.
ఎస్సై, కానిస్టేబుల్