మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో మంగళవారం ఇంటర్ చదువుతున్న ధీరజ్ ఫిట్స్‌తో మృతి చెందాడు. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే విద్యార్థి చనిపోయాడని ఆరోపిస్తూ.. విద్యార్థి సంఘాలు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. సకాలంలో స్పందించక పోవడం వల్లే విద్యార్థి మృతి చెందాడని ఆరోపించారు. ప్రిన్సిపల్ సైదులును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సబ్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు వినతి పత్రం అందజేశారు.
బెల్లంపల్లిలో విద్యార్థి సంఘాల ధర్నా - విద్యార్థి సంఘాల ధర్నా
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.
విద్యార్థి సంఘాల ధర్నా