మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని మామిడిగూడెం, పెద్ద ధర్మారం, చిన్న ధర్మారం, అశోక్ నగర్, గోండుగూడెం, కొమ్ముగూడెం గ్రామాల ప్రజలకు నిత్యం ప్రమాదకర ప్రయాణం తప్పడం లేదు. మండల కేంద్రానికి వెళ్లాలంటే వాగు అడ్డంకిగా మారింది. ఓ వైపు గుట్టలు మరో వైపు సింగరేణి ఉపరితల గని సరిహద్దులతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. వాగుపై నుంచి దేవపూర్ వరకు ఓరియంట్ సిమెంట్ కంపెనీ వేసిన రైల్వే ట్రాక్ వంతెనే వీరికి ఆధారంగా మారింది. వాగుపై 20 మీటర్ల ఎత్తులో ఉన్న రైల్వే ట్రాక్‌పై మరమ్మతుల కోసం అమర్చిన అర మీటరు ఇనుపరేకు వీరి గమనానికి ఆధారమవుతుంది. గూడ్స్ రైలు వెళ్లని సమయంలో దీనిపై పయనిస్తూ గమ్యానికి చేరుకుంటారు. 40 ఏళ్లుగా ఈ సమస్య ఉందని... అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదని స్థానికులు తెలిపారు. వాగుపై వంతెనలు నిర్మిస్తేనే తమ కష్టాలు దూరమవుతాయని ఆయా గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.
విన్యాసం కాదు... తప్పని ప్రయాణం... - danger-taverl-at-kasimpet
వీరిది పట్టాలపై విన్యాసం కాదు. గమ్యం చేరడానికి సాగిస్తున్న ప్రమాదకర ప్రయాణం. నలభై ఏళ్లుగా కాసిపేట మండలంలోని పలు గ్రామల ప్రజలు ఇలాగే గమ్యానికి చేరుకుంటున్నారు.
విన్యాసం కాదు... తప్పని ప్రయాణం...