మంచిర్యాల జిల్లాలో జనతా కర్ఫ్యూలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన 14 గంటల కర్ఫ్యూ, రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కర్ఫ్యూతో మార్కెట్ సముదాయాలు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసి వేశారు.
మంచిర్యాలలో జనతా కర్ఫ్యూ - MANCHERYAL JANATHA CURFEW
మంచిర్యాల జిల్లాలో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. జిల్లాలోని మార్కెట్ సముదాయాలు, పెట్రోల్ బంకులతో సహా దుకాణాలు మూసివెయ్యగా, అత్యవసర సేవలకై ఆసుపత్రులు తెరచి ఉంచారు.
మంచిర్యాలలో జనతా కర్ఫ్యూ
కర్ఫ్యూ వాతావరణంతో మంచిర్యాల్ పట్టణంలోని మార్కెట్ సముదాయాలు, పెట్రోల్ బంకులు స్వచ్ఛందంగా మూసి వేశారు. మార్కెట్ ఏరియా నిర్మానుష్యంగా మారింది. కేవలం అత్యవసర సేవలైన ఆసుపత్రులు తెరచి ఉంచారు. బసులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రయాణికులు లేక బస్టాండ్లు నిర్మాణుష్యంగా దర్శన మిచ్చాయి.